కామ, క్రోధ, మోహమనే విషయ వికారాలను తొలగించుకున్నప్పుడే మనిషికి సుఖశాంతులు లభిస్తాయని పద్మరావునగర్ బ్రహ్మకుమారి ఇన్ఛార్జ్ అనిత చెప్పారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని నగరంలోని కవాడిగూడ భవానీ శంకర్ ఆలయప్రాంగణంలో... బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక చిత్రప్రదర్శన ఏర్పాటు చేశారు. 84వ త్రిమూర్తి శతజయంతి మహోత్సవాలు సైతం నిర్వహించారు.
'చెడుపై మంచి సాధించిన విజయమే శివరాత్రి' - Brahmakumari's mahashivaratri celebrations
చెడుపై మంచి సాధించిన విజయమే శివరాత్రి అని పద్మరావునగర్ బ్రహ్మకుమారి ఇన్ఛార్జ్ అనిత తెలిపారు. హైదరాబాద్ కవాడిగూడ భవానీ శంకర్ దేవాలయంలో వారి సొసైటీ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక చిత్రప్రదర్శన ఏర్పాటు చేశారు.
!['చెడుపై మంచి సాధించిన విజయమే శివరాత్రి' Brahma kumaris](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6162934-834-6162934-1582352999441.jpg)
Brahma kumaris
ఈ చిత్ర ప్రదర్శనలో దేశంలోని జ్యోతిర్లింగాల దర్శనం, వాటి పవిత్రత, ప్రత్యేకతల గురించి బ్రహ్మకుమారి ప్రతినిధులు భక్తులకు వివరించారు. చిత్రప్రదర్శన, చైతన్యదేవీల దర్శనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అదేవిధంగా మహాశివరాత్రి పర్వదినంలో భాగంగా దేవాలయంలో భక్తులు జల, పాలాభిషేకాలను చేశారు.
చెడుపై మంచి సాధించిన విజయమే శివరాత్రి
ఇదీ చూడండి :శివరాత్రినాడు ఈ ఆలయంలో వింత ఆచారం