న్యూ ఇయర్ జోష్.. భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు Rush at Temples On New Year : ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఆలయాలను దర్శించుకున్న భక్తులు కొత్త సంవత్సరంలో అవరోధాలు తొలగాలని, ఆశయాలు నెరవేరాలని వేడుకున్నారు. ప్రముఖ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
కొత్త ఏడాది వేళ హైదరాబాద్‌లోని ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఆలయాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. బిర్లా మందిర్‌కు జనం పోటెత్తారు. వేకువజాము నుంచే పెద్ద ఎత్తున తరలివచ్చి.. కొత్త ఏడాది ఆరోగ్యం, సంతోషం ప్రసాదించాలని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఈ సందర్భంగా యువతీ యువకులు సెల్ఫీలు తీసుకుంటూ ఉత్సాహంగా గడిపారు.
Heavy Rush at Yadadri Temple : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలోనూ భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే స్వామి వారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. ధర్మదర్శనానికి రెండున్నర గంటల సమయం పడుతుండగా.. ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది.కొండపైన బస్ బే, కల్యాణ కట్ట, పుష్కరిణి వద్ద భక్తుల కోలాహలం నెలకొంది.
ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఓరుగల్లులోని శ్రీ భద్రకాళీ ఆలయానికి భక్తులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూలైన్లలో బారులు తీరారు. నూతన సంవత్సరం సందర్భంగా అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవీ నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారు మోగింది.
ఇవీ చదవండి: