తెలంగాణ

telangana

ETV Bharat / state

అన్నవరం ఆలయానికి పోటెత్తిన భక్తులు.. క్యూలైన్లలో తొక్కిసలాట - Devotees flock to Annavaram temple

సత్యదేవుని దర్శనం కోసం అన్నవరం దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. వారాంతం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. రద్దీ నియంత్రణపై ఆలయ సిబ్బంది దృష్టి సారించకపోవడంతో ఆలయ క్యూలైన్లలో వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు గంటలకొద్దీ నిరీక్షిస్తున్నారు.

అన్నవరంలో పోటెత్తిన భక్తులు.. తోపులాట
అన్నవరంలో పోటెత్తిన భక్తులు.. తోపులాట

By

Published : Nov 13, 2022, 5:34 PM IST

అన్నవరంలో పోటెత్తిన భక్తులు.. తోపులాట

ఏపీలోనిఅన్నవరం దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. సత్యదేవుని దర్శనం కోసం ఆలయం క్యూలైన్లలో గంటలకొద్దీ నిరీక్షిస్తున్నారు. క్యూలైన్లలో చిన్నపిల్లలతో తల్లులు ఇబ్బందిపడుతున్నారు. భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయం క్యూలైన్లలోని తూర్పు రాజగోపురం వద్ద తొక్కిసలాట జరిగింది. క్యూలైన్లలో వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు అవస్థలు పడుతున్నారు. రద్దీ నియంత్రణపై ఆలయ సిబ్బంది దృష్టి సారించలేదు. కొండపై పార్కింగ్‌లో వందలాది వాహనాలు బారులు తీరాయి.

ABOUT THE AUTHOR

...view details