తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీ: ఆన్​లైన్​ టికెట్లు ఉంటేనే శ్రీవారి దర్శనం - chittor news

ఆంధ్రప్రదేశ్​లోని శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కొవిడ్‌ నేపథ్యంలో తిరుమల వచ్చే భక్తులకు ఆన్​లైన్ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉంటేనే అలిపిరిలో అనుమతిస్తున్నారు.

devotees-coming-to-thirumala-on-the-backdrop-of-kovid-to-celebrate-the-srivari-brahmotsava-are-allowed-online-in-alipiri-if-they-have-special-admission-tickets
ఏపీ: ఆన్​లైన్​ టికెట్లు ఉంటేనే శ్రీవారి దర్శనం

By

Published : Sep 19, 2020, 1:42 PM IST

ఏపీ తిరుమల శ్రీవారి ఆన్‌లైన్ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉన్న వారిని మాత్రమే కొండపైకి అనుమతిస్తున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా ఈ నెలాఖరు వరకు సంబంధించిన టికెట్లను విక్రయించారు. అలిపిరి తనిఖీ కేంద్రంలో టిక్కెట్లను పరిశీలించి.. భక్తులను అనుమతిస్తున్నారు. కొంత మంది భక్తులు టికెట్లు లేకుండా అలిపిరికి చేరుకుని భద్రతా సిబ్బంతో వాగ్వాదంకు దిగుతున్నారు.

కొవిడ్ నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలో దర్శన టికెట్లను జారీ చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. పెరటాసి మాసం తొలి శనివారం కాగా అధిక మంది యాత్రికులు టికెట్లు లేకుండా వస్తారనే ఉద్దేశంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద భద్రతను ఏర్పాటు చేశారు.

ఇదీ చదవండి:తిరుమలేశుడి బ్రహ్మోత్సవాలు.. నేడు ధ్వజారోహణం

ABOUT THE AUTHOR

...view details