తిరుమల శ్రీవారి ఆలయం తలుపులు భక్తుల కోసం త్వరలో తెరచుకోనున్నాయి. జూన్ 8 నుంచి మూడు రోజుల పాటు తితిదే ఉద్యోగులు, తిరుమల స్థానికులకు ప్రయోగాత్మక దర్శనం కల్పించనున్నారు. ఈ మేరకు ఏపీ దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. జూన్ 11 నుంచి సామాన్య భక్తులకు దర్శనభాగ్యం కల్పించే అవకాశం ఉంది.
ఈనెల 11నుంచి తిరుమలేశుని దర్శనం! - devotees allowed for darshan at tirumala tirupati
శ్రీవారి దర్శనం కోసం భక్తుల ఎదురుచూపులు ఫలించాయి. జూన్ 11 నుంచి సామాన్య భక్తులకు భక్తులకు స్వామి వారి ఆలయం తలుపులు తెరుచుకోనున్నాయి. జూన్ 8 నుంచి మూడు రోజులపాటు తితిదే ఉద్యోగులతోపాటు తిరుమల స్థానికులకు ప్రయోగాత్మక దర్శనం కల్పించి.. వాటి అనుగుణంగా తుది నిర్ణయం తీసుకోనున్నారు.
11 నుంచి భక్తులకు తిరుమలేశుని దర్శనం!
సర్వదర్శనాలకు కూడా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే నిబంధన తీసుకురానున్నట్లు తెలిసింది. పది రోజులు గడిచాక భక్తుల సంఖ్యను పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. శని, ఆదివారాల నుంచి తిరుమలకు ఆర్టీసీ బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.