ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆ రాష్ట్ర తెదేపా దేవినేని ఉమ ఉదయం 10 నుంచి సాయంత్ర 5 గంటల వరకు దీక్ష చేపట్టాలనుకున్నారు. అయితే అంతకుముందు దేవినేని ఇంటి వద్దకు పోలీసులు రాకుండా తెదేపా కార్యకర్తలు అడ్డుకున్నారు.
పోలీసుల పరేషాన్: క్యాప్, మాస్క్‌తో దేవినేని ఉమ! - దేవినేని ఉమ అరెస్టు వార్తలు
ఏపీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా ఆ రాష్ట్ర తెదేపా నేత దేవినేని ఉమ గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేపట్టాలని నిర్ణయించారు. అయితే పోలీసులు గుర్తుపట్టకుండా వెళ్లేందుకు ఆయన ప్రయత్నించారు.
క్యాప్, మాస్క్‌తో బయటకొచ్చిన దేవినేని ఉమ
ఆయన ఇంటికి వెళ్లే మార్గాల వద్ద బారికేడ్లు పెట్టారు. దేవినేని ఉమ ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులు గుర్తు పట్టకుండా క్యాప్, మాస్క్ పెట్టుకుని బయటకు వచ్చారు ఉమ. కాసేపయ్యాక గుర్తుపట్టిన పోలీసులు దేవినేనిని అరెస్టు చేశారు.
ఇదీ చదవండి:కాళేశ్వరంలో కేసీఆర్... గోదారి జలాలతో అభిషేకం