తెలంగాణ

telangana

ETV Bharat / state

బాలా త్రిపుర సుందరిగా బంగారు మైసమ్మ - హైదరాబాద్​ తాజా వార్తలు

హైదరాబాద్ నగరంలోని మధురానగర్​లోని శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారి ఆలయంలో ఉత్సవాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

devi-navarathrulu-in-madhuranagar-bangaru-maisamma-temple
బాలా త్రిపుర సుందరిగా మధురా నగర్​ బంగారు మైసమ్మ

By

Published : Oct 17, 2020, 5:29 PM IST

దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా హైదరాబాద్​ మధురానగర్​లోని శ్రీ బంగారు మైసమ్మ అమ్మవారి ఆలయంలో ఉత్సవాలు, ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ ఛైర్మన్ గుర్రం పవన్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో అమ్మవారికి సుప్రభాత సేవ, విశేషాభిషేకం, పంచహారతులు నిర్వహించారు.

ఈ నెల 25 వ తేదీ వరకు అమ్మవారు రోజుకొక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారని, ప్రతిరోజు కుంకుమ పూజ నిర్వహిస్తామని ఛైర్మన్ తెలిపారు. పూజా కార్యక్రమంలో కార్పొరేటర్ సామల హేమ, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:కల్వకుర్తి ఎత్తిపోతల వద్ద ఉద్రిక్తత... రేవంత్ రెడ్డికి గాయం

ABOUT THE AUTHOR

...view details