Solar Wind Power Increage: రోజురోజుకి పెరుగుపోతున్న జనాభాతో పాటు మనం వాడుకుంటున్న విద్యుత్ కూడా నానాటికి పెరిగి పోతోంది. ఈ పరిస్థితుల్లో అనేక రకాలుగా విద్యుత్ మనం తయారు చేసుకుంటున్నా, అవి అన్ని తరగిపోయే శక్తి వనరులే అందుకే ఇప్పుడు ప్రభుత్వాలు కొత్తగా ఆలోచించి సాంప్రదాయేతర ఇందనాలుపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాయి. ఇప్పటికే సోలార్ ఎనర్జీలో దేశంలో తెలంగాణ రాష్ట్రం 4వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో సోలార్, విండ్ ఎనర్జీ ఉత్పత్తిని పెంచడంతో పాటు విద్యుత్‌ను ఆదాచేసే పరికరాలు, బల్బుల వాడకాన్ని తెలంగాణ రెడ్కో ప్రోత్సహిస్తోంది.
పునరుత్పాదక ఇంధన కార్యక్రమం: తెలంగాణ రాష్ట్ర ఎలక్ట్రిక్ వాహనాలు, ఎనర్జీ స్టోరేజీ సొల్యూషన్ పాలసీతో పాటు అన్ని పునరుత్పాదక శక్తి, ఇంధన సంరక్షణ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం పటిష్టంగా అమలు చేస్తోంది. పునరుత్పాదక ఇంధన కార్యక్రమం కింద, రాష్ట్రం ఇప్పటికే 4511.77 మెగావాట్ల సౌరశక్తిని సాధించింది. రాష్ట్రంలో విద్యుత్‌ను ఆదాచేసే సమర్థవంతమైన ఉపకరణాల పంపిణీ, డిమాండ్ సైడ్ మేనేజ్‌మెంట్ యాక్టివిటీ కింద ఎల్ఈడీ స్ట్రీట్‌లైట్లను ఏర్పాటు చేస్తోంది. విద్యుత్ సంరక్షణ కార్యకలాపాల వలన రాష్ట్రంలో 1,005 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా చేశారు. అన్ని గ్రామపంచాయతీలలో ఎల్ఈడీ వీధిలైట్లను అమర్చే కార్యక్రమాన్ని ప్రారంభించారు. తద్వారా వార్షిక ఇంధన పొదుపులో దాదాపు 50శాతం సాధించవచ్చని అంచనా వేస్తున్నారు.