బీటెక్, బీఫార్మసీ చివరి ఏడాది విద్యార్థులకు హాజరు ఆధారిత డిటెన్షన్‌ను రద్దు చేస్తున్నట్లు హైదరాబాద్ జేఎన్‌టీయూ ప్రకటించింది. కరోనా పరిస్థితుల కారణంగా 2020-21 విద్యా సంవత్సరంలో రెండు సెమిస్టర్లు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే బోధించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వర్సిటీ ప్రకటించింది. ఆన్‌లైన్ తరగతులు లేదా మిడ్ పరీక్షలకు హాజరుకాని విద్యార్థులను డిటెయిన్ చేయాలని కళాశాల యాజమాన్యం నిర్ణయించే పక్షంలో సదరు విద్యార్థి హాల్‌టికెట్లను ముందుగానే వర్సిటీ రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని ఆ ప్రకటనలో పేర్కొంది.
ఫైనలియర్ విద్యార్థులకు ఊరట.. హాజరు ఆధారిత డిటెన్షన్ రద్దు - హాజరు ఆధారిత డిటెన్షన్ రద్దు
ఇంజినీరింగ్, ఫార్మసీ ఫైనలియర్ విద్యార్థులకు హైదరాబాద్ జవహర్లాల్ నెహ్రూ టెక్నోలాజికల్ యూనివర్సిటీ వెసులుబాటు కల్పించింది. చివరి ఏడాదిలో హాజరు ఆధారిత డిటెన్షన్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా కారణంగా 2020-21 విద్యాసంవత్సరంలో రెండు సెమిస్టర్లు ఆన్‌లైన్‌లోనే బోధించడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
జవహర్లాల్ నెహ్రూ టెక్నోలాజికల్ యూనివర్సిటీ
వచ్చే నెల 14 నుంచి జరగనున్న బీటెక్/బీఫార్మసీ చివరి ఏడాది పరీక్షల రుసుం చెల్లింపునకు సంబంధించి జేఎన్‌టీయూ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 29వతేదీ చివరి తేదీగా నిర్ణయించింది. రూ.100 ఆలస్య రుసుంతో వచ్చే నెల ఒకటో తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే నెల 4లోపు రూ.1000, 9లోగా రూ.2000, 12లోగా రూ.5000, పరీక్షలు ముగిసేవరకు రూ.10 వేల ఆలస్య రుసుంతో దరఖాస్తు చేసుకోవచ్చు.