తెలంగాణ

telangana

ETV Bharat / state

కొవిడ్‌ సమయంలోనూ ప్రదర్శన కనబరిచిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ - Telangana Socio-Economic Survey

కొవిడ్ కారణంగా ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ప్రభావితమైనా రాష్ట్రం మాత్రం ఉత్తమ ప్రదర్శన కనబరిచింది. ఈ మేరకు విడుదలైన తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే వివరాల ప్రకారం 2020-21 సంవత్సరానికి 9 లక్షల 78 కోట్ల జీడీఎస్పీ నమోదైంది. కొవిడ్ వేళ ముందుచూపు, పకడ్బందీ చర్యలతో సంక్షేమానికి కృషి చేస్తూనే ప్రజాశ్రేయస్సుకు ప్రభుత్వం ఉపక్రమించిందని సామాజిక ఆర్థిక సర్వే కితాబిచ్చింది.

కొవిడ్‌ సమయంలోనూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రదర్శన
కొవిడ్‌ సమయంలోనూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రదర్శన

By

Published : Mar 19, 2021, 2:08 PM IST

కొవిడ్‌ సమయంలోనూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ప్రదర్శన

రాష్ట్ర వార్షిక బడ్జెట్‌తో పాటు 2020-21కి సంబంధించి తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే రాష్ట్రం మెరుగైన ప్రదర్శనే కనబరిచినట్లు పేర్కొంది. ఈ ఏడాది అన్ని రంగాలు దెబ్బతిన్నా వ్యవసాయ అనుబంధ రంగాలు పురోగమించాయి. రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధరంగం 20.9 శాతం వృద్ధి రేటు సాధించినట్లు పేర్కొంది. జాతీయ స్థాయిలో ఆ రంగంలో 3 శాతానికే వృద్ధిరేటు పరిమితమైనా... రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎప్పుడూ లేనివిధంగా వ్యవసాయ అనుబంధ రంగాల వాటా జీడీఎస్పీలో అనూహ్యంగా పెరిగింది. 2020-21లో పరిశ్రమలరంగం 5.6 శాతానికి, సేవల రంగం 4.9 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. జాతీయస్థాయిలో ఆ రంగాల ప్రదర్శనతో పోల్చి చూసినప్పుడు... తెలంగాణలోని ఈ రంగాలు మెరుగైన ప్రదర్శన కనబరిచాయని సర్వే తెలిపింది.2020-21 లో జీఎస్డీపీలో సేవల రంగం వాటా 54 శాతంగా ఉంది. ఆ సమయంలో పరిశ్రమల వాటా 26, వ్యవసాయ అనుబంధ రంగాల వాటా 20 శాతానికి పరిమితమైనట్లు ఆర్థికసర్వే తెలిపింది. 2019-20లో వ్యవసాయ రంగం వాటా 18 శాతం, పరిశ్రమల రంగం వాటా 27 శాతం, సేవా రంగం వాటా 55 శాతం ఉందని వివరించింది.

కీలక పాత్ర

దేశ ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ 23.5 శాతం వాటాతో కీలక పాత్ర పోషిస్తోంది. 2020 లోమూడు వేల కంపెనీలు రాష్ట్రంలో విస్తరణ, పెట్టుబడులతో 30వేల667 కోట్లను ఆర్జించింది. తద్వారా కొత్తగా లక్షా79 వేల మందికి ఉపాధి లభించింది.ఈజ్‌ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రం...... తొలి3 స్థానాల్లో కొనసాగుతోంది. ఎగుమతుల పరంగా చూస్తే 2019-20 సంవత్సరానికి గాను రాష్ట్రం నుంచి 1.8 లక్షల కోట్ల ఎగుమతులు జరిగాయి. వాటిలో 28.8 శాతం ఉత్పత్తుల ఎగుమతుల కాగా..... 71.1 శాతం సేవల ఎగుమతులుగా సర్వే పేర్కొంది. తలసరి ఆదాయం జాతీయంగా పోలిస్తే 2020-21 గానూ 1.78 రెట్లు ఎక్కువగా ఉందని సర్వే తెలిపింది.

ఆర్థిక సర్వే

కరోనా తొలి కేసు నమోదైనప్పటి నుంచిప్రజలప్రాణాలు కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్రియాశీలక చర్యలు చేపట్టిందని సర్వే పేర్కొంది. తద్వారా కరోనా మరణాల శాతం 0.5 శాతానికి పరిమితమైందని... ఇది జాతీయ మరణ రేటు కన్నా తక్కువని వెల్లడించింది. వైరస్ కట్టడి, లాక్‌డౌన్ అమలు, పేదలను ఆదుకోవటంలో ప్రభుత్వం సఫలీకృతమైనట్లు వివరించింది. లాక్‌డౌన్‌తో ఆదాయం కోల్పోయిన 81 లక్షలకు పైగా కుటుంబాలకు 1500 చొప్పున రెండుసార్లు సాయం అందించినట్లు ఆర్థిక సర్వే వెల్లడించింది. లాక్‌డౌన్‌తో ప్రత్యామ్నాయ మార్గాలైన డిజిటల్ లిటరిసీ పెంచటం, ఆరోగ్య సిబ్బందిని కార్యోన్ముఖులను చేయటం, సాంకేతికత తోడుగా ఎమర్జింగ్ టెక్నాలజీస్ వైపు ఫ్రేంవర్క్ రూపొందించటం వంటి చర్యలతో సర్కార్‌ స్మార్ట్‌గా వ్యవహరించిందని పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details