షాపింగ్ మాల్స్, చిరువ్యాపారులు, కొచింగ్ సెంటర్లు ఇలా ఒక్కటేంటి రోడ్డు పోడువునా ఏదో ఒక బిజినెస్ జరుగుతూ అమీర్‌పేట సందడిగా ఉండేది. వందల మందికి ఉపాధి కల్పిస్తూ.. ఎప్పుడూ రద్దీగా ఉండే అమీర్‌పేట వీధులు నేడు నిర్మానుష్యంగా మారాయి.. దీంతో ఇక్కడే వివిధ వ్యాపారాలు చేసుకుని ఉపాధి పొందే ఎంతో మంది చిరువ్యాపారస్థులు ఆర్థికంగా దివాళా తీస్తున్నారు.
అమీర్‌పేటలో చిరు వ్యాపారుల బతుకు రోడ్డున పడింది! - desolat ameerpet streets
చిరువ్యాపారులకు కేంద్రమైన అమీర్‌పేట్ నేడు బోసి పోయింది. 24 గంటలూ జనంతో కిక్కిరిసిపోయి వందల మందికి ఉపాధి కల్పిస్తూ.. ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం నిర్మానుష్యంగా మారింది. ఫలితంగా అక్కడి వ్యాపారులు రోడ్జున పడ్డారు.
![అమీర్‌పేటలో చిరు వ్యాపారుల బతుకు రోడ్డున పడింది!](https://etvbharatimages.akamaized.net/breaking/breaking_1200.png)
Breaking News
అక్కడ అన్ని రకాల వస్తువులు అందరికీ అందుబాటు ధరలో లభిస్తాయి. అందుకే చిరువ్యాపారులు, వినియోగదారులు.. కొనుగోలు చేసేందుకు పెద్ద సంఖ్యలో వచ్చేవారు. కానీ ప్రస్తుతం కరోనా కారణంగా కొనుగోలు చేసే వారు లేక షాపులు బోసిపోయాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. జనాలు రావడంలేదని వ్యాపారులు చెబుతున్నారు. బిజినెస్‌లు సాగకపోవడంతో... పూట గడవడమే కష్టంగా ఉందని ఆందోళన చెందుతున్నారు.
బోసిపోయిన అమీర్‌పేట... ఆందోళనలో చిరువ్యాపారులు
ఇదీ చూడండి:కరోనా లీలలు: పైసల కోసం బతికున్న మనిషిని చంపేశారు!