తెలంగాణ

telangana

ETV Bharat / state

అమెరికాలో ఉండాలనే ఆశతో.. - STUDENTS ILLEGAL IMMIGRATION

అమెరికాలో స్థిరపడాలనే కోరిక భారతీయ విద్యార్థులకు చిక్కులు తెచ్చిపెడుతోంది. దళారులను నమ్మి బోగస్​ వర్సిటీలో చేరుతున్న విద్యార్థులపై అమెరికా ఇమ్నిగ్రేషన్ కోర్టు విచారణ చేపట్టనుంది. విద్య కోసం కాకుండా...అక్రమంగా కొనసాగేందుకే మెుగ్గు చూపి జైలు పాలవుతున్నవారిలో తెలుగు విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉండటం గమనార్హం...

indian students 1

By

Published : Feb 1, 2019, 10:49 AM IST

US TELUGU 1
అమెరికాలో వెలుగుచూసిన విద్యార్థుల అక్రమ వీసాల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తోంది. ఎలాగైన అమెరికాలో స్థిరపడాలనే కోరికే భారతీయ విద్యార్థులకు సమస్యలు తెచ్చిపెట్టింది. ఉన్నత విద్య, కొలువుల మోజులో పడి ఆరువందల మంది విద్యార్థులు జైలు పాలయ్యారు. అరెస్టయిన వారిలో తెలుగువారే అధికంగా ఉన్నారు. విద్యార్థులకు న్యాయ సహాయం చేసేందుకు తెలుగు సంఘాలు ముందుకొచ్చాయి.
అమెరికా హోంల్యాండ్​ విభాగం అదుపులో ఉన్న భారతీయ విద్యార్థుల భవితవ్యం నేడో రేపో తేలనుంది. బోగస్​ వర్సిటీలో విద్యార్థులను చేర్పించిన ఎనిమిది మంది దళారులను అరెస్టు చేశారు. వారందరు తెలుగువారే కావడం గమనించాల్సిన అంశం.

అమెరికాలో సుమారు 12 లక్షల మంది విదేశీ విద్యార్థులుండగా.. వారిలో దాదాపు 2.27 లక్షల మంది భారతీయ విద్యార్థులే. వీరిలో అమెరికాలోనే స్థిరపడాలని వెళ్లిన వారే అధికం. రెండేళ్ల చదువు.. మూడేళ్ల ఓపీటీ పూర్తైన తర్వాత తాత్కాలిక వీసాలు రాకపోవడంతో...అక్కడే ఉండేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. చదువు కోసం కాకుండా... కేవలం అమెరికాలో కొనసాగేందుకే... హోంల్యాండ్ విభాగం సృష్టించిన యూనివర్సిటీలో చేరారు. పోలీసుల అదుపులో ఉన్న సుమారు 600 మంది విద్యార్థులను విచారణ అనంతరం తప్పు చేసినట్లు రుజువైతే వెంటనే స్వదేశానికి పంపించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details