కార్మికుల కన్నీటి కథల్ని పాటలుగా మలిచిన శ్రీకాకుళం శ్రీశ్రీ వంగపండు ప్రసాద రావు అని దేశపతి శ్రీనివాస్ అన్నారు. కార్మికుల్లో, ప్రజల్లో ప్రతిఘటన చైతన్యాన్ని నింపిన విప్లవ సాహిత్య మూర్తి వంగపండు అని దేశపతి గుర్తు చేశారు.
వంగపండు.. శ్రీకాకుళం శ్రీశ్రీ : దేశపతి శ్రీనివాస్ - దేశ్పతి
శ్రీకాకుళం యాసకు.. కళింగాంధ్ర భాషకు కొత్త రూపునిచ్చి.. ప్రజలకు అర్థమయ్యేలా పాటలు రాసి.. విప్లవ మార్గంలో అభ్యుదయ గీతాలతో ఉత్తేజ పరిచిన వంగపండు ప్రసాద రావు మరణం కళాకారులకు, విప్లవకారులకు, తెలుగు సాహిత్యానికి తీరని లోటని ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. వంగపండు ప్రసాద రావు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి.. నివాళులు అర్పించారు.
ఆయన మరణం కళా ప్రపంచానికి తీరని లోటని, సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో ఆ వెలితి అలాగే ఉండిపోతుందని ఆయన అన్నారు. ప్రజలను చైతన్య పరిచే పాటకు కొత్త రూపాన్నిచ్చి.. తనదైన శైలిలో విప్లవ గీతాలతో ప్రజలను, యువతను ఉర్రూతలూగించారని అన్నారు. ఏం పిల్లడో ఎల్దమొస్తవా.. యంత్రమెట్ల నడుస్తున్నదంటే.. అనే పాటలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని ఇంకా ఎన్నో మరుపురాని పాటల రూపంలో ప్రజల నాలుకల మీద పాటల రూపంలో వంగపండు ప్రసాదరావు బతికే ఉంటారని దేశపతి శ్రీనివాస్ అన్నారు. ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ.. నివాళి అర్పించారు.