తెలంగాణ

telangana

ETV Bharat / state

'అంకితభావంతో విధులు నిర్వహించి పదవికే వన్నె తేవాలి'

విధి నిర్వహణలో ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించాలని పోస్టింగ్స్​ పొందిన డిప్యూటీ తహసీల్దార్లు, ఎక్సైజ్​ ఇన్​స్పెక్టర్లకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్​ ఛైర్మన్​ వినోద్​కుమార్​ సూచించారు. మంత్రుల నివాసంలో కొంతమంది కొత్తగా పోస్టింగ్​ పొందిన అధికారులు వినోద్​కుమార్​తో సమావేశమయ్యారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆయన వారికి వివరించారు.

deputy-tahasildars-and-excise-inspectors-meet-boinpally-vinodkumar
'అంకితభావంతో విధులు నిర్వహించి పదవికే వన్నె తేవాలి'

By

Published : Jul 26, 2020, 8:17 PM IST

అంకితభావంతో విధులు నిర్వహించి ఆ పదవికే వన్నె తేవాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్​ ఛైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ డిప్యూటీ తహసీల్దార్, ఎక్సైజ్ ఇన్​స్పెక్టర్లకు సూచించారు. శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత పోస్టింగ్స్​ పొందిన 257 మంది డిప్యూటీ తహసీల్దార్లు, 284 మంది ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్లలో కొందరు టీఎస్​పీఎస్సీ మాజీ సభ్యులు వివేక్ ఆధ్వర్యంలో మంత్రుల అధికారిక నివాసంలో వినోద్ కుమార్​తో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో వినోద్ కుమార్​కు కృతజ్ఞతలు తెలిపారు. విధి నిర్వహణలో ప్రజలతో మమేకం కావాలని వినోద్​కుమార్​ వారికి సూచించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి వారికి ప్రభుత్వ ప్రతినిధిగా అండగా నిలవాలని వినోద్ కుమార్ సూచించారు. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను సాధించాలని, నియమ నిబంధనలను పక్కాగా పాటించాలని పేర్కొన్నారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరేలా చూడాలని, ఈ విషయంలో నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఆయా గ్రామాలు, మండలాల్లోని ప్రజా ప్రతినిధుల సూచనలు, సలహాలు తీసుకోవాలని, ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని సూచించారు. అనునిత్యం ప్రజల్లో ఉండే ప్రజా ప్రతినిధులు తమ అనుభవంతో అనేక అంశాలపై పట్టు కలిగి ఉంటారని, వాళ్లు చెప్పే ప్రతి అంశాన్ని ఓపికతో వినాలని వినోద్ కుమార్ అన్నారు.

ఇవీ చూడండి: హైదరాబాద్‌ మేయర్ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details