పరిసరాల పరిశుభ్రతలో జీహెచ్ఎంసీ చేస్తున్న కృషికి ప్రజలు కూడా సహకరించాలని ఉపసభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. జీహెచ్ఎంసీ ద్వారా కొత్తగా సికింద్రాబాద్ నియోజకవర్గానికి సమకూరిన 6 శానిటేషన్ ఆటోలను ఆయన సీతాఫల్మండి ముల్టీపర్పస్ హాల్ వద్ద ప్రారంభించారు.
'జీహెచ్ఎంసీ కృషికి ప్రజలు కూడా సహకరించాలి' - Deputy Speaker launched Sanitation Vehicles
జీహెచ్ఎంసీ ద్వారా కొత్తగా సికింద్రాబాద్ నియోజకవర్గానికి సమకూరిన 6 శానిటేషన్ ఆటోలను డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సీతాఫల్మండి ముల్టీపర్పస్ హాల్ వద్ద ప్రారంభించారు.
శానిటేషన్ ఆటోలు
డిప్యూటీ స్పీకర్ పద్మారావు కాసేపు శానిటేషన్ వాహనాన్ని నడిపారు. సికింద్రాబాద్లోని అన్ని కాలనీలు, బస్తీలను పరిశుభ్రంగా ఉంచాలని, అవసరమైన పక్షంలో అదనంగా సిబ్బందిని, వనరులను సమకూర్చుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, ఉప కమిషనర్ మోహన్ రెడ్డి, కార్పొరేటర్లు, తెరాస కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.