హైదరాబాద్ అడ్డగుట్ట డివిజన్లోని ఆజాద్ చంద్రశేఖర్ నగర్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాన్ని కార్పొరేటర్ విజయకుమారితో కలిసి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పరిశీలించారు.
48 ఇళ్లు నిర్మించాల్సి ఉండగా, స్థల వివాదంతో 24 ఇళ్లు మాత్రమే నిర్మిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆ సమస్యను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మిగిలిన 24 ఇళ్లు నిర్మించాలని, పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలంలో జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్‌కు కేటాయించాలని సూచించారు.