సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంలో సఫలీకృతం అవుతున్నట్లు డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ తెలిపారు. అడ్డగుట్ట డివిజన్లో ఆయన పలు అభివృధి పనులను ప్రారంభించారు. 48 లక్షలతో చేపడుతున్న వెంకట్ నగర్ నాలా పునర్నిర్మాణం, 13 లక్షలతో సీసీ రోడ్డు, 12.50 లక్షలతో కొత్త పవర్ బోరింగ్ నిర్మాణాలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్, డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి, తెరాస యువ నేత తీగుల్ల రామేశ్వర్ గౌడ్, అధికారులు పాల్గొన్నారు.
Deputy speaker: తెరాసతోనే అభివృద్ధి సాధ్యమైంది: పద్మారావు గౌడ్ - పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
సికింద్రాబాద్ అడ్డగుట్ట డివిజన్లో ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ పలు అభివృధి పనులను ప్రారంభించారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకొచ్చాకే సికింద్రాబాద్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు.
తెరాసతోనే అభివృద్ధి సాధ్యమైంది: పద్మారావు గౌడ్
50 సంవత్సరాలుగా కేవలం కాగితాలకు, నాయకుల హామీలకే పరిమితమైన తుకారాం గేటు నిర్మాణ పనులు తెరాస వచ్చాకే ప్రారంభమైందని పద్మారావు గౌడ్ అన్నారు. తన చొరవ కారణంగానే రాష్ట్ర ప్రభుత్వం 29.50 కోట్ల రుపాయల నిధులను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. అలాగే అడ్డగుట్టలో జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను మొదలుపెట్టినట్లు ఉప సభాపతి పద్మారావు గౌడ్ తెలిపారు.
ఇదీ చూడండి:నవ్వులు పూయిస్తున్న ఏటీఎం దొంగల తతంగం.. ఏం చేశారంటే..!