మహబూబ్నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ విధానాలపై విస్తృతంగా ప్రచారం చేయాలని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ సూచించారు. పట్టభద్రుల ఎన్నికల్లో తెరాస అభ్యర్థి సురభి వాణీదేవి విజయానికి అందరూ కృషి చేయాలని కోరారు. సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచార సరళిపై తన క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేయండి: తీగుల్ల పద్మారావు గౌడ్ - ఉపసభాపతి తీగుల్ల శ్రీనివాస్ గౌడ్ సమావేశం
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి వాణీదేవిని గెలిపించాలని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల ప్రచార తీరుపై తన క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఎన్నికల్లో విస్తృతంగా ప్రచారం చేయండి: తీగుల్ల పద్మారావు గౌడ్
న్యాయవాదులకు ప్రత్యేక నిధి మంజూరు, పలు సంక్షేమ పథకాలపై ఓటర్లకు అవగాహన కల్పించాలని ఆయన పేర్కొన్నారు. ప్రతి 50 మంది ఓటర్లకు ఇద్దరు ప్రతినిధులను సమన్వయకర్తలుగా నియమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల ఇంఛార్జి శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు సామల హేమ, రాసురి సునీతా, కంది శైలజ, లింగాని ప్రసన్నలక్ష్మీ శ్రీనివాస్, సమన్వయకర్తలు జలంధర్ రెడ్డి, రాజ సుందర్, నేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు.