తెలంగాణ

telangana

ETV Bharat / state

అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలి: పద్మారావు గౌడ్ - తీగుల్ల పద్మారావు గౌడ్ వార్తలు

రూ.11 లక్షల ఖర్చుతో నిర్మిస్తున్న డ్రైనేజీ పైప్​లైన్ నిర్మాణ పనులను ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ప్రారంభించారు. సికింద్రాబాద్ పరిధిలోని ఐదు డివిజన్లలో నిలిచిన అభివృద్ధి పనులను శరవేగంగా చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు.

deputy speaker theegulla padmarao goud,  mylargadda
తీగుల్ల పద్మారావు గౌడ్ , సికింద్రాబాద్ మైలార్​గ​డ్డ

By

Published : Apr 3, 2021, 4:35 PM IST

సికింద్రాబాద్ పరిధిలోని ఐదు డివిజన్లలో ఎన్నికల కోడ్, ఇతరత్రా కారణాల వల్ల నిలిచిన అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేాయాలని ఉపసభాపతి పద్మారావు గౌడ్ అధికారులను ఆదేశించారు. వేసవిలో నీటి ఎద్దడికి ఆస్కారం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. మైలార్​గ​డ్డలోని 8వ నెంబరు కాలనీలో రూ.11 లక్షల ఖర్చుతో నిర్మిస్తున్న డ్రైనేజీ పైప్​లైన్ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. రోడ్లు వేయడానికి ముందే మంచి నీరు, డ్రైనేజీ పనులను పూర్తి చేయాలని సూచించారు.

అడ్డగుట్టలోని స్థానిక ప్రజలకు నీటి కొరతను తీర్చేందుకు డిప్యూటీ స్పీకర్ ఆదేశాల మేరకు కొత్తగా ఓ పవర్ బోరింగ్​ ఏర్పాటు చేశారు. వెంకట్ నగర్​లో మరో పవర్ బోరింగ్ ఏర్పాటు పనులను స్థానిక కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, తెరాస యువ నేత తీగుల్ల రమేశ్వర్ గౌడ్ ప్రారంభించారు.

ఇదీ చూడండి:యాదాద్రిపై కరోనా ప్రభావం.. భారీగా తగ్గిన ఆదాయం

ABOUT THE AUTHOR

...view details