రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా సికింద్రాబాద్‌లోని తన నివాసంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తనయుడు రామేశ్వర్ గౌడ్ మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్ హరితయజ్ఞం రూపంలో మళ్లీ మొక్కలు నాటడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ఎంపీ సంతోష్ కుమార్ ఒక్కరితో మొదలుపెట్టి దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తున్నారని రామేశ్వర్ గౌడ్ అన్నారు. సీడ్ గణేష్ కార్యక్రమంలో భాగంగా జీహెచ్ఎంసీ సిబ్బంది గణేష్ ప్రతిమను రామేశ్వర్ గౌడ్‌కు అందించారు.