తెలంగాణ

telangana

ETV Bharat / state

వైద్య సాయం కింద సీఎంఆర్​ఎఫ్​ నుంచి రూ. 5.50 లక్షలు మంజూరు - cmrf

పేద ప్రజలు మెరుగైన వైద్యం చేయించుకునేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని శాసనసభ ఉపసభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. సీతాఫల్​మండిలోని బ్రాహ్మణ బస్తీకి చెందిన మధుకర్​ యాదవ్​ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో వైద్యం కోసం సీఎంఆర్​ఎఫ్​ నుంచి రూ. 5 లక్షల 50 వేలు మంజూరు చేయించారు.

telangana assembley deputy speaker, cmrf
డిప్యూటీ స్పీకర్​ నిధుల మంజూరు, సీఎంఆర్​ఎఫ్

By

Published : Apr 18, 2021, 4:42 PM IST

పేద ప్రజలందరూ సీఎంఆర్​ఎఫ్​ను సద్వినియోగం చేసుకోవాలని శాసనసభ ఉపసభాపతి శ్రీ తీగుళ్ల పద్మారావు గౌడ్​ సూచించారు. అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన వైద్యం చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్న ఓ వ్యక్తికి రూ. 5 లక్షల 50వేలు మంజూరు చేయించారు. సికింద్రాబాద్​ సీతాఫల్​మండిలోని బ్రాహ్మణ బస్తీకి చెందిన మధుకర్​ యాదవ్​ గత కొంతకాలంగా వైద్యం చేయించుకోలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

విషయం తెలుసుకున్న ఉపసభాపతి.. సీఎంవోతో సంప్రదించి ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. ఐదున్నర లక్షలు మంజూరు చేయించారు. నిధుల మంజూరు పత్రాన్ని ఆయనకు అందజేశారు. పేద ప్రజలు మెరుగైన వైద్యం చేయించుకునేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు.

ఇదీ చదవండి:జీహెచ్​ఎంసీలో రానున్న 4 రోజులు శానిటైజేషన్: కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details