తెలంగాణ

telangana

ETV Bharat / state

వచ్చే మూడేళ్లలో సికింద్రాబాద్​ రూపురేఖలు మారిపోతాయి: పద్మారావు గౌడ్​ - తెలంగాణ తాజా వార్తలు

సికింద్రాబాద్​లో పెండింగ్​లో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేస్తున్నట్లు ఉపసభాపతి పద్మారావు గౌడ్​ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని అడ్డగుట్ట డివిజన్ పరిధిలోని శాంతినగర్, అంబేడ్కర్​నగర్​లో నూతనంగా నిర్మిస్తున్న కమ్యునిటీ హాల్​ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.

వచ్చే మూడేళ్లలో సికింద్రాబాద్​ రూపురేకలు మారిపోనున్నాయి: పద్మారావు గౌడ్​
వచ్చే మూడేళ్లలో సికింద్రాబాద్​ రూపురేకలు మారిపోనున్నాయి: పద్మారావు గౌడ్​

By

Published : Aug 28, 2020, 8:51 PM IST

సికింద్రాబాద్​ నియోజకవర్గంలో గత 50ఏళ్లుగా పెండింగ్​లో ఉన్న పనులను... ఐదేళ్లలో శరవేగంగా పూర్తి చేస్తున్నామని ఉపసభాపతి పద్మారావుగౌడ్​ అన్నారు. నియోజకవర్గంలోని అడ్డగుట్ట డివిజన్​ పరిధిలోని శాంతినగర్​, అంబేడ్కర్​నగర్​లో నూతనంగా నిర్మిస్తున్న కమ్యునిటీ హాల్​ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. అనంతరం నార్త్ లాలాగూడలో రూ. 13,50,000తో నిర్మిస్తున్న రోడ్డు పనులకు ఆయన శ్రీకారం చుట్టారు.

వచ్చే మూడేళ్లలో సికింద్రాబాద్ రూపురేఖలు మారిపోనున్నాయని పేర్కొన్నారు. రోడ్డు విస్తరణ పనులు మొదలుకొని అన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. సికింద్రాబాద్​ను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషిచేస్తున్నామని పద్మారావు గౌడ్​ అన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్​ విజయ కుమారి, తెరాస యువ నేత తీగుల్ల రామేశ్వర్ గౌడ్​, ఉప కమిషనర్ మోహన్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details