ఉప సభాపతి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్ జన్మదిన వేడుకలు బుధవారం నిరాడంబరంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి కేటీఆర్‌లు సహా పలువురు ప్రముఖులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
నిరాడంబరంగా పద్మారావుగౌడ్ జన్మదిన వేడుకలు - deputy speaker Padmaravu goud latest news
ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ పుట్టినరోజు వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. పలువురు ప్రముఖులు, కార్యకర్తలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

పద్మారావుగౌడ్ జన్మదిన వేడుకలు
పుట్టినరోజును పురస్కరించుకుని పద్మారావుగౌడ్ అభిమానులు వివిధ సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పద్మారావుగౌడ్ పలువురు వికలాంగులకు వీల్‌చైర్స్ అందించారు. అభిమానులు, కార్యకర్తల అభ్యర్థన మేరకే పుట్టినరోజు వేడుకలను నిర్వహించుకున్నట్లు ఆయన వివరించారు.
ఇదీ చూడండి:వీడలేక వీడుతున్న మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలు