జీహెచ్ఎంసీ నార్త్ జోన్ సికింద్రాబాద్ సర్కిల్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందిన సీనియర్ ఉద్యోగి ప్రమోద్‌కి తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి తీగుళ్ల పద్మారావు గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. రెండు సంవత్సరాల క్రితం సికింద్రాబాద్ పరిధిలో విధుల్లో చేరి.. నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేసిన అధికారి అని డిప్యూటి స్పీకర్ అన్నారు. ప్రమోద్ ఉద్యోగంలో ఉన్నప్పుడు చేసిన సేవలను కొనియాడారు. పదవీ విరమణ తర్వాత ఆయన సుఖంగా, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్టు పద్మారావు గౌడ్ తెలిపారు.
రిటైర్డ్ అధికారికి పద్మారావు గౌడ్ శుభాకాంక్షలు - డిప్యూటీ స్పీకర్
జీహెచ్ఎంసీ నార్త్‌జోన్, సికింద్రాబాద్ సర్కిల్లో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా విధులు నిర్వహించి పదవీ విరమణ పొందిన ప్రమోద్‌కి తెలంగాణ రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధిలో తన వంతు కృషి చేస్తూ.. విధులు నిర్వహించిన ప్రమోద్ లాంటి అధికారులు సమాజానికి అవసరం అని ఆయన అన్నారు.
పదవీ విరమణ పొందిన అధికారికి శుభాకాంక్షలు తెలిపిన పద్మారావు గౌడ్