సికింద్రాబాద్ తార్నాక డివిజన్లో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి ఆధ్వర్యంలో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ పాల్గొని సభ్యత్వ నమోదును ప్రారంభించారు.
సమస్యల పరిష్కారంలో ముందుండాలి: పద్మారావు గౌడ్ - హైదరాబాద్ తాజా వార్తలు
తెరాస కార్యకర్తలు నిత్యం ప్రజలతో కలిసిపోయి వారి సమస్యల పరిష్కరించడంలో ముందుండాలని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారంలో ముందుండాలి: పద్మారావు గౌడ్
కార్యకర్తలే పార్టీకి బలమన్నారు. కార్యకర్తలు నిత్యం ప్రజలతో కలిసిపోయి వారి సమస్యల పరిష్కరించడంలో ముందుండాలని సూచించారు. సభ్యత్వం తీసుకున్న వారికి లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుందని తెలిపారు.
ఇదీ చదవండి: చెరువులో దూకి తల్లి, ఏడాదిన్నర చిన్నారి మృతి