తెలంగాణ

telangana

ETV Bharat / state

'జంటనగరాల్లో రెండున్నర కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యం'

సికింద్రాబాద్ లాలాపేట్​లోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో ఉపసభాపతి పద్మారావు గౌడ్ మొక్కలు నాటారు. ఆరో విడత హరితహారంలో భాగంగా జంటనగరాల్లో రెండున్నర కోట్ల మొక్కలు నాటాడమే లక్ష్యం పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.

deputy speaker padmarao goud participated in haritha haaram
deputy speaker padmarao goud participated in haritha haaram

By

Published : Jun 25, 2020, 5:37 PM IST

ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా... సికింద్రాబాద్ లాలాపేట్​లోని ప్రొఫెసర్ జయశంకర్ స్టేడియంలో ఉపసభాపతి పద్మారావు గౌడ్ మొక్కలు నాటారు. జంటనగరాల్లో రెండున్నర కోట్ల మొక్కలు నాటటమే లక్ష్యంగా నిర్ధారించుకున్నామని పద్మారావు గౌడ్​ తెలిపారు.

ప్రకృతిని పరిరక్షించుకోకపోతే అనర్థాలు తప్పవని హెచ్చరించారు. లాలాపేట్​లోని స్టేడియంలో అంతర్జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించేందుకు రూ. 6 కోట్లతో స్విమ్మింగ్​ ఫూల్​ నిర్మిస్తున్నామని తెలిపారు. ఆధునిక హంగులతో ఫంక్షన్ హాల్ నిర్మిస్తామని పద్మారావు గౌడ్​ హామీ ఇచ్చారు.

ఇవీ చూడండి:రాష్ట్రానికి కేంద్రం జీఎస్టీ నష్ట పరిహారం చెల్లించేనా?

ABOUT THE AUTHOR

...view details