తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాసకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు: పద్మారావు గౌడ్​ - సీతాఫల్​మండీలో తెరాస నాయకుల సంబురాలు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణీదేవి గెలుపునకు అహర్నిశలు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. సికింద్రాబాద్​ సీతాఫల్​మండీలో ఓ ఫంక్షన్​హాల్​లో విజయోత్సవ సంబురాలను జరుపుకున్నారు.

Deputy speaker padmarao goud  MLC elections celebrations at seethaphal mandi in secunderabad c
తెరాసకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు: పద్మారావు గౌడ్​

By

Published : Mar 21, 2021, 9:14 PM IST

హైదరాబాద్-మహబూబ్​నగర్-రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి వాణీదేవిని అత్యధిక మెజారిటీతో గెలిపించిన ఓటర్లకు ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. తెరాస విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలను అభినందించారు. సికింద్రాబాద్​ సీతాఫల్​మండీలో ఓ ఫంక్షన్​హాల్​లో విజయోత్సవ సంబురాలను జరుపుకున్నారు.

అనంతరం పద్మారావు గౌడ్ అధ్వర్యంలో అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా తెరాసదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్​ సామల హేమ, నాయకులు శేఖర్, శైలేందర్, మళ్లురి అనిల్ కుమార్, గౌస్, సాయి, లోకేశ్​, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:'ఏ ప్రభుత్వమూ మా సంక్షేమానికి కృషి చేయలేదు'

ABOUT THE AUTHOR

...view details