తెలంగాణ

telangana

ETV Bharat / state

'వంతెన నిర్మాణంతో ఇబ్బందులు తొలగుతాయి' - Hyderabad latest news

తుకారాంగేట్ రైల్వే గేటు వద్ద రోడ్డు వంతెన నిర్మాణంతో స్థానికుల ఇబ్బందులు తొలగిపోతాయని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. ఆర్​యూబీ ప్రాజెక్ట్ పనులను అయన పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లకుపైగా నిధులు ఇప్పటికే మంజూరు చేసిందని తెలిపారు.

Deputy speaker Padmarao Goud inspected the railway gate road bridge
రైల్వే గేటు రోడ్డు వంతెన పరిశీలించిన ఉప సభాపతి పద్మారావు గౌడ్

By

Published : Jan 27, 2021, 9:09 PM IST

తుకారాంగేట్ రైల్వే గేటు వద్ద రోడ్డు వంతెన (ఆర్​యూబీ) నిర్మాణంతో స్థానికుల ఇబ్బందులు తొలగిపోతాయని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. ఆర్​యూబీ ప్రాజెక్ట్ పనులను అయన పరిశీలించారు.

రూ.29 కోట్ల ఖర్చుతో చేపడుతున్న ప్రాజెక్ట్ పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం.. రూ.15 కోట్లకుపైగా నిధులను ఇప్పటికే మంజూరు చేసిందని తెలిపారు. అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి సైతం ఫండ్స్​ విడుదల చేయించినట్లు పద్మారావు గౌడ్ వెల్లడించారు. ఎన్నికల కోడ్ పూర్తైన వెంటనే అధికారులతో కలసి సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి:నిర్లక్ష్యం... తెరాస నేతలపై కోర్టు ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details