రాష్ట్రంలో బస్తీ వాసులకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం బస్తీ దవాఖానాల సంఖ్యను పెంచిందని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గంలోని శ్రీరామ్‌నగర్, బోజగుట్టలో నూతనంగా నిర్మించిన బస్తీదవాఖానాను ఆయన ప్రారంభించారు.
బస్తీ దవాఖానాను ప్రారంభించిన పద్మారావు గౌడ్ - గ్రేటర్ పరిధిలో 45 బస్తీ దవాఖానాలు ప్రారంభం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో 45 బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ప్రారంభించింది. హైదరాబాద్ నాంపల్లి నియోజకవర్గంలోని శ్రీరామ్‌నగర్, బోజగుట్టలో నూతనంగా నిర్మించిన బస్తీదవాఖానాను రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ప్రారంభించారు.
![బస్తీ దవాఖానాను ప్రారంభించిన పద్మారావు గౌడ్ padmarao goud inaugurated of basti dawakhana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7301484-thumbnail-3x2-padma-rk.jpg)
బస్తీ దవాఖానాలను ప్రారంభించిన డిప్యూటీ స్పీకర్
కరోనా వ్యాప్తి కారణంగా ఆస్పత్రికి వచ్చే వారంతా భౌతిక దూరం పాటించాలని పద్మారావుగౌడ్ సూచించారు. ఆస్పత్రిలో రోగుల కోసం ఏర్పాటు చేసిన వసతులను పరిశీలించారు. కార్యక్రమంలో నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ మెరాజ్ హుస్సేన్, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:గ్రేటర్లో మరో 45 బస్తీ దవాఖానాలు ప్రారంభం