తెలంగాణ

telangana

ETV Bharat / state

పేదలకు అధునాతన వైద్యం అందిస్తాం: పద్మారావు గౌడ్ - హైదరాబాద్​ లేటెస్ట్​ వార్తలు

వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారుతున్న నేపథ్యంలో పేదలకు ఉపకరించేలా రాష్ట్ర ప్రభుత్వం డయాగ్నస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు ఉపసభాపతి పద్మారావు గౌడ్​ తెలిపారు. సీతాఫల్​మండిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డయాగ్నస్టిక్ హబ్​ను ప్రారంభించారు.

deputy speaker padmarao goud inaugurated diagnostic center
పేదలకు అధునాత వైద్యం అందిస్తాం: పద్మారావు గౌడ్

By

Published : Jan 22, 2021, 4:40 PM IST

Updated : Jan 22, 2021, 9:19 PM IST

సీతాఫల్​మండిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్ హబ్​ను ఉపసభాపతి పద్మారావు గౌడ్ ప్రారంభించారు. వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారుతున్న నేపథ్యంలో పేదలకు ఉపకరించేలా రాష్ట్ర ప్రభుత్వం డయాగ్నస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వైద్య సేవలు అందుబాటులో లేని బస్తీలను ప్రత్యేకంగా గుర్తించి బస్తీ దవాఖానాలను తీసుకొచ్చినట్లు చెప్పారు.

బస్తీ దవాఖానాలతోపాటు డయాగ్నస్టిక్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. నగర వ్యాప్తంగా 319 బస్తీ దవఖనాలను దశల వారీగా ఏర్పాటు చేశామన్నారు. రక్త పరీక్ష వంటి సాధారణ వైద్య పరీక్షల నుంచి ఈసీజీ, ఎంఆర్​ఐ సేవలను పూర్తి ఉచితంగా అందించేందుకు డయాగ్నస్టిక్ హబ్ కేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:సమాన అవకాశాలతోనే సమతూకం సాధ్యం: కేటీఆర్

Last Updated : Jan 22, 2021, 9:19 PM IST

ABOUT THE AUTHOR

...view details