తెలంగాణ

telangana

ETV Bharat / state

బస్తీ దవాఖానాలను ప్రారంభించిన ఉపసభాపతి పద్మారావుగౌడ్​ - hyderabad news

సికింద్రాబాద్​ నియోజవర్గంలోని బౌద్దనగర్​​, సీతాఫల్​మండీ డివిజన్లలోని పలు కాలనీల్లో ఉపసభాపతి పద్మారావు గౌడ్​ బస్తీ దవాఖానాలను ప్రారంభించారు. వైద్య ఖరీదైన వ్యవహారంగా మారుతున్న నేపథ్యంలో పేదలకు బస్తీ దవాఖానాలు ఎంతగానో ఉపయోగపడుతున్నారు.

deputy speaker padmarao goud inaugurated basti hospitals in hyderabad
బస్తీ దవాఖానాలను ప్రారంభించిన ఉపసభాపతి పద్మారావుగౌడ్​

By

Published : Nov 12, 2020, 8:46 PM IST

వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారుతున్న నేపథ్యంలో పేదలకు బస్తీ దవాఖానాల ఏర్పాటు వల్ల మేలు చేకూరుతుందని ఉపసభాపతి పద్మారావు గౌడ్​ అన్నారు. సికింద్రాబాద్​ నియోజకవర్గం బౌద్ధనగర్ డివిజన్​లోని అంబానగర్​ కాలనీలో, సీతాఫల్​మండీ డివిజన్​లోని ఇందిరానగర్​ కాలనీలో రెండు బస్తీ దవాఖానాలను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు. ప్రస్తుతం జీహెచ్​ఎంసీ పరిధిలో 200 బస్తీ దవాఖానాలు ఉన్నాయని.. వాటి ద్వారా ప్రతిరోజు 20 వేల మందికి వైద్య సేవలు అందుతున్నాయన్నారు.
ప్రతి బస్తీ దవాఖానాలో ఓ వైద్యుడు, నర్సు, సహాయకుడు ఉంటారని తెలిపారు. వివిధ పరీక్షలు ఉచితంగా నిర్వహించడంతో పాటు మందులు కూడా ఉచితంగా అందిస్తారని వెల్లడించారు. సికింద్రాబాద్ పరిధిలో ఇప్పటికే రవీంద్రనగర్ , చింత బావి, లంబాడీ బస్తీ ప్రాంతాల్లో ఇప్పటికే మూడు బస్తీ దవాఖనాలు నెలకొల్పామన్నారు. త్వరలో ఆర్య నగర్, వినోభా నగర్, అడ్డగుట్ట ప్రాంతాల్లో కూడా వీటిని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని పద్మారావు గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శ్రీమతి ధనంజన బాయిగౌడ్, కుమారి సామల హేమ, తెరాస నేతలు కిషోర్ కుమార్ గౌడ్, తీగుల్ల రామేశ్వర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details