సికింద్రాబాద్ పరిధిలోని జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బందికి సీతాఫల్ మండిలోని ఓ ఫంక్షన్హాల్లో రాష్ట్ర శాసన సభ ఉప సభాపతి పద్మారావు గౌడ్ నిత్యావసరాలను పంపిణీ చేశారు. కరోనా వ్యాధిని ఎదుర్కోవడంలో పారిశుద్ధ్య సిబ్బంది పాత్ర కీలకమైనదని తెలిపారు. వారి సేవలు ఎప్పటికీ నిలిచిపోతాయన్నారు. ప్రస్తుత ఆపత్కాలంలో తమ వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి... సమాజాన్ని వారు రక్షిస్తున్నారని ప్రశంసించారు. జీహెచ్ఎంసీ ఉప కమిషనర్ రవి కుమార్, సీతాఫల్‌మండీ కార్పొరేటర్ సామల హేమ, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి సంజయ్ అగర్వాల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
పారిశుద్ధ్య సిబ్బందికి సరుకులు పంచిన పద్మారావు గౌడ్ - సికింద్రాబాద్ పారిశుద్ధ్య సిబ్బంది నిత్యావసరాల పంపిణీ
తెలంగాణ శాసనసభ ఉప సభాపతి పద్మారావు గౌడ్ అధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బందికి నిత్యావసరాలను పంచారు. సికింద్రాబాద్ పరిధిలోని జీహెచ్ఎంసీ శానిటేషన్ కార్మికులకు ఆయన వీటిని అందించారు.
నిత్యావసరాల పంపిణీ