సికింద్రాబాద్ నియోజకవర్గంలోని నామాలగుండు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఉపసభాపతి పద్మారావు గౌడ్ పంపిణీ చేశారు. రూ.5 లక్షల విలువైన చెక్కులు అందించారు. తెలంగాణలో అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలవుతున్నాయని ఆయన తెలిపారు. అభివృద్ధి పరంగా సికింద్రాబాద్‌ను అగ్ర స్థానంలో నిలుపుతున్నామని తెలిపారు.
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ - deputy speaker padmarao goud distribute cm releaf fund cheqes
పేదలకు కార్పొరేట్ వైద్యం భారం కాకుండా ఆదుకుంటున్న ఘనత తెరాస ప్రభుత్వానిదేనని ఉప సభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని నామాలగుండులో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందించారు.
ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేసిన ఉపసభాపతి