పేదలకు వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారిందని, ప్రభుత్వ పరంగా వారిని ఆదుకునేందుకు కృషి చేస్తున్నామని...ఉప సభాపతి తీగుల్ల పద్మారావు తెలిపారు. బస్తీ దవాఖానాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సికింద్రాబాద్లోని క్యాంపు కార్యాలయంలో 72 మందికి రూ.50 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.
'సీఎం సహాయ నిధి పేదలకు వరప్రసాదం లాంటిది' - hyderabad latest news
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఓ వర ప్రసాదంగా నిలుస్తోందని... ఉప సభాపతి తీగుల్ల పద్మారావు అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే దాని ఫలాలు పేదలకు చేరుతున్నాయని తెలిపారు. సికింద్రాబాద్లోని క్యాంపు కార్యాలయంలో 72 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.

సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేసిన ఉప సభాపతి పద్మారావు
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఓ వర ప్రసాదంగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే సీఎంఆర్ఎఫ్ ఫలాలు పేదలకు చేరుతున్నాయని పద్మారావు గౌడ్ తెలిపారు. తమ పరిధిలో కరోనా వ్యాప్తి కట్టడికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అత్యవసర సమయాల్లో తమ కార్యాలయం ఫోన్ నెంబరును 040-27504448 లో సంప్రదించాలని సూచించారు.
ఇదీ చదవండి: పొద్దు తిరుగుడుకు రక్షణగా.. ఓ రైతు వినూత్న ఆలోచన