నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందించేందుకు తన వంతు కృషి చేస్తున్నానని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా విడుదలైన నిధుల మంజూరు పత్రాలను సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు ఆయన అందించారు.
'నిరుపేదలకు మంచి వైద్యాన్ని అందించేందుకు కృషి చేస్తా' - ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ వార్తలు
ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి వైద్య ఖర్చుల కోసం మంజూరైన ఎల్‌వోసీ పత్రాలను ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ లబ్ధిదారులకు అందజేశారు. సికింద్రాబాద్ క్యాంపు కార్యాలయంలో రూ.3 లక్షల విలువజేసే ఎల్‌వోసీ పత్రాలను పంపిణీ చేశారు.
ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్, సికింద్రాబాద్ క్యాంప్ కార్యాలయం
సికింద్రాబాద్ క్యాంపు కార్యాలయంలో రూ.3 లక్షల విలువజేసే ఎల్‌వోసీ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.