తక్కువ ఖర్చుతో మెరుగైన హోమియోపతి సేవలు అందించే ముగ్గురు వైద్యులను డిప్యూటీ స్పీకర్ పద్మారావు అభినందించారు. అనుభవజ్ఞులైన ముగ్గురు డాక్టర్లు కలిసి ఏవీఎస్ హోమియోపతి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. ఈ కేంద్రం మొదటి వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలందించడం భేష్: పద్మారావు - తెలంగాణ వార్తలు
ముగ్గురు వైద్యులు కలిసి ఓ హోమియోపతి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని డిప్యూటి స్పీకర్ పద్మారావు కొనియాడారు. తక్కువ ఖర్చుతో మెరుగైన సేవలందించడం సంతోషకరమని అన్నారు. ఈ హోమియోపతి మొదటి వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.
తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలందించడం భేష్: పద్మారావు
హోమియోపతి వైద్య రంగంలో కొత్త ఒరవడిని సృష్టించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ ఆన్లైన్ ద్వారా సేవలందిస్తున్నట్లు వెల్లడించారు. మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోని వారికీ మందులు కొరియర్ చేస్తున్నామని వివరించారు. మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని కొన్ని ఆఫర్లను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.
ఇదీ చదవండి:కృత్రిమ అవయవాల దాత.. విధివంచితుల పాలిట వెలుగుప్రదాత