కొవిడ్ కట్టడికి లాక్ డౌన్ వంటి చర్యలతో పాటు అర్హులైన వారందరికి వ్యాక్సిన్ అందించడమే మంచిదని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందన్నారు ఉపసభాపతి పద్మారావు (Deputy speaker padmarao). అందుకే టీకా పంపిణీ ప్రక్రియకు అధిక ప్రాముఖ్యతను కల్పిస్తున్నామని తెలిపారు. సీతాఫల్ మండిలో సికింద్రాబాద్ నియోజకవర్గ సూపర్ స్ప్రెడర్స్ ప్రత్యేక టీకా కేంద్రాన్ని తనిఖీ చేశారు. జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఉప కమిషనర్ మోహన్ రెడ్డిలతో పాటు అధికారులు ఉన్నారు.
Vaccination: 'అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ అందిస్తాం' - ఉపసభాపతి పద్మారావు న్యూస్
హైదరాబాద్ సీతాఫల్ మండిలో సూపర్ స్ప్రెడర్స్ ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఉపసభాపతి పద్మారావు తనిఖీ చేశారు. అర్హులైన వారందరికీ టీకా అందిస్తున్నామని తెలిపారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని కోరారు.
teeka
ప్రభుత్వం అత్యంత పకడ్బందీగా ప్రత్యేక వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపడుతోందని ఆయన పేర్కొన్నారు. సూపర్ స్ప్రెడర్స్కు సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో కనీసం 15 వేల మందికి టీకాలు ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు జరుపుతున్నామన్నారు.