రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు... శాసనసభ ఉప సభాపతి పద్మారావు గౌడ్ తెలిపారు. తెరాస ప్రభుత్వం మహిళల సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. సికింద్రాబాద్ సీతాఫల్‌మండీలో తెరాస సీనియర్ నాయకురాలు ఎర్ర జ్యోతి అధ్వర్యంలో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఆయన హాజర్యయారు.
'తెరాస ప్రభుత్వం మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉంది' - hyderabad latest news
తెరాస ప్రభుత్వం మహిళల సంక్షేమానికి కట్టుబడి ఉందని... శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు. వివిధ పథకాలను పకడ్బందీగా అమలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. సికింద్రాబాద్ సీతాఫల్‌మండీలో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఆయన హాజర్యయారు.
'తెరాస ప్రభుత్వం మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉంది'
తాము వ్యక్తిగతంగా మహిళలను ప్రోత్సహిస్తామని ఉప సభాపతి అన్నారు. సీతాఫల్‌మండీలోని మేడి బావి ప్రాంతంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్లు కుమారి సామల హేమ, శ్రీమతి కంది శైలజ పాల్గొన్నారు.
ఇదీ చదవండి:అక్రమార్కులకు చుట్టం...అవినీతికే పట్టం