సికింద్రాబాద్ బౌద్ధనగర్ డివిజన్ అల్లాడి రాజ్కుమార్నగర్లో రూ. 27 లక్షల ఖర్చుతో నిర్మిస్తున్న నిర్మాణ పనులను ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ప్రారంభించారు. ఈ ప్రాంతంలో మురుగునీటి సమస్య లేకుండా శాశ్వత పరిష్కారానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
సివరేజి వ్యవస్థను అధునీకరిస్తున్నాం: పద్మారావు గౌడ్ - హైదరాబాద్ వార్తలు
సివరేజి సమస్యల శాశ్వత పరిష్కారానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ బౌద్ధనగర్ డివిజన్ అల్లాడి రాజ్‌కుమార్ నగర్లో రూ. 27 లక్షల ఖర్చుతో నిర్మిస్తున్న మురుగునీటి నిర్మాణ పనులను ప్రారంభించారు.
సివరేజి వ్యవస్థను అధునీకరిస్తున్నాం: పద్మారావు గౌడ్
దశాబ్దాల క్రితం అప్పటి అవసరాలు, అప్పటి జనాభాకు అనుగుణంగా చేసిన సివరేజి వ్యవస్థకు కాలం చెల్లినందున భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని సివరేజి వ్యవస్థను అధునీకరిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ధనంజన గౌడ్ పాల్గొన్నారు.