హైదరాబాద్ సీతాఫల్మండి డివిజన్లో రూ.25 లక్షల ఖర్చుతో ఫ్రైడే మార్కెట్ వద్ద నిర్మించిన కొత్త కల్వర్ట్ మార్గాన్ని ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ ప్రారంభించారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో వివిధ రహదారులను అభివృద్ది చేస్తున్నామని, ఇరుకుగా మారిన కల్వర్టులను విస్తరించి నాలాలలో నీటి ప్రవాహం సాఫీగా సాగేలా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు.
కొత్త కల్వర్టు మార్గాన్ని ప్రారంభించిన ఉపసభాపతి పద్మారావు గౌడ్ - ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్
సికింద్రాబాద్ నియోజకవర్గంలో రహదారులను అభివృద్ధి చేస్తున్నామని ఉపసభాపతి పద్మారావు గౌడ్ తెలిపారు. సీతాఫల్మండి డివిజన్లో నిర్మించిన కొత్త కల్వర్టు మార్గాన్ని ఆయన ప్రారంభించారు.
కొత్త కల్వర్టు మార్గాన్ని ప్రారంభించిన ఉపసభాపతి పద్మారావుగౌడ్
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కుమారి సామల హేమ, ఉప కమిషనర్ మోహన్ రెడ్డి, ఈఈ ప్రమోద్ కుమార్, డిప్యూటీ ఈఈ పరమేష్, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:'కులవృత్తుల అభివృద్ధికి దోహదపడుతున్న ఏకైక రాష్ట్రం మనదే'