తెలంగాణ

telangana

By

Published : Jul 14, 2020, 4:51 PM IST

ETV Bharat / state

డిప్యూటీ స్పీకర్ పద్మారావు జీ.. మాస్క్ ధరించకపోతే ఎలా ?

సికింద్రాబాద్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్​ మాస్క్ ధరించకుండా బోనాల పండుగ ఉత్సవాల్లో పాల్గొన్నారు. కరోనా వైరస్​ బారిన పడిన ఉపసభాపతి.. ఎలాంటి జాగ్రత్తలు లేకుండానే మళ్లీ ప్రజల్లోకి రావడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.

డిప్యూటీ స్పీకర్ పద్మారావు జీ.. మాస్క్ ధరించకపోతే ఎలా ?
డిప్యూటీ స్పీకర్ పద్మారావు జీ.. మాస్క్ ధరించకపోతే ఎలా ?

డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ వ్యవహారశైలి మరోసారి వివాదాస్పదమైంది. ఇటీవల మంత్రి కేటీఆర్ ఓ కార్యక్రమంలో.. పద్మారావు మాస్క్ ధరించకుండా జాగ్రత్తలు తీసుకోకుండా ఉండటం వల్ల కరోనా సోకిన పరిణామాలను ఒక ఉదాహరణగా వివరించారు. హైదరాబాద్​లో ఉన్న వాళ్లకి కరోనా వైరస్ రాదని చెప్పిన డిప్యూటీ స్పీకర్ పద్మారావుకే కొవిడ్ సోకడం చర్చనీయాంశమైంది.

మంత్రి కేటీఆర్ చెప్పినప్పటికీ...

గతంలో పద్మారావు నిర్వహించిన ఓ ప్రభుత్వ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపసభాపతికి మంత్రి కేటీఆర్ మాస్క్ ఇచ్చినప్పటికీ ఆయన తిరస్కరించారు. ఈ క్రమంలో భాగ్యనగర వాసులకు కరోనా రాదని చెప్పిన పద్మారావు మహమ్మారి బారిన పడ్డారు. అయినప్పటిరకీ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న పద్మరావు వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు రాలేదు. ప్రస్తుతం హోమ్ క్వారంటైన్​లో ఉంటున్న పద్మారావు సోమవారం జరిగిన బోనాల పండుగ ఉత్సవాల్లో భాగంగా ఫలహారం బండి ఊరేగింపులో డిప్యూటీ స్పీకర్ పాల్గొన్నారు.

మాస్క్ లేకుండా ప్రజల్లోకి..

వైరస్ సోకి హోమ్ క్వారంటైన్​లో ఉన్న పద్మారావు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే ఫలహారం బండి ఊరేగింపు వద్ద కొబ్బరికాయలు కొట్టారు. మాస్క్ ధరించకుండానే మళ్లీ ప్రజల్లో తిరగడం స్థానికులను ఆందోళన కలిగిస్తుంది. ప్రజలకు జాగ్రత్తలు సూచించాల్సిన నేతలే బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుండటం సర్వత్రా చర్చనీయాంశమైంది.

డిప్యూటీ స్పీకర్ పద్మారావు జీ.. మాస్క్ ధరించకపోతే ఎలా ?

ఇవీ చూడండి : 'పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సిబ్బంది పెరగాలి'

ABOUT THE AUTHOR

...view details