తెలంగాణ

telangana

ETV Bharat / state

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ అందించిన ఉపసభాపతి - హైదరాబాద్​ తాజా వార్తలు

అనారోగ్యంతో ఉన్న పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సీఎం సహాయ నిధి నుంచి విడుదలైన నిధులకు సంబంధించిన పత్రాలను లబ్ధిదారులకు ఉప సభాపతి తీగల పద్మారావు అందించారు. సీతాఫల్​మండి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూ. 4 లక్షలకు సంబంధించిన ఎల్​ఓసీ పత్రాలను పంపిణీ చేశారు.

Deputy  speaker distributed CM assistance fund documents
సీఎం సహాయ నిధి పత్రాలు పంపిణీ చేసిన ఉపసభాపతి

By

Published : Mar 8, 2021, 9:47 PM IST

పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించే కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ పరిధిలోని పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి విడుదలైన నిధుల మంజూరు పత్రాలను ఉపసభాపతి తీగుల్ల పద్మారావు అందజేశారు. సీతాఫల్​మండి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రూ.4 లక్షలకు సంబంధించిన ఎల్​ఓసీ పత్రాలను పంపిణీ చేశారు.

సీతాఫల్​మండి ప్రాంతానికి చెందిన మధుకర్​ యాదవ్​కు​, అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన అంజలి సీఎం రిలీఫ్ ఫండ్​ను ఉపసభాపతి పద్మారావు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెరాస నేతలు కంది నారాయణ, పాక సాయి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:దేశంలోనే తెలంగాణ నంబర్​వన్​

ABOUT THE AUTHOR

...view details