తెలంగాణ

telangana

ETV Bharat / state

'డిప్యూటీ స్పీకర్ సాబ్.. కాంగ్రెస్​కు మీ ఓటేయండి.!' - Greater hyderabad municipal elections 2020

డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు అనూహ్యమైన పరిస్థితి ఎదురైంది. మోండా మార్కెట్​ డివిజన్ కాంగ్రెస్ కార్పొరేటర్ అభ్యర్థి బాల ప్రశాంతి.. గల్లీ గల్లీ తిరుగుతున్న ప్రశాంతి ప్రచారంలో భాగంగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఇంటికి వెళ్లి మరీ ఆశీస్సులు తీసుకున్నారు. కాంగ్రెస్​ పార్టీకి ఓటు వేయాలని ఆయనను కోరారు. అవాక్కవటం ఆయన వంతైంది.

డిప్యూటీ స్పీకర్ సాబ్ మీ ఓటు కాంగ్రెస్​కు వేయండి: బాల ప్రశాంతి
డిప్యూటీ స్పీకర్ సాబ్ మీ ఓటు కాంగ్రెస్​కు వేయండి: బాల ప్రశాంతి

By

Published : Nov 27, 2020, 7:30 PM IST

తాను గెలిస్తే మోండా మార్కెట్​ డివిజన్ పరిధిలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కాంగ్రెస్ అభ్యర్థి బాల ప్రశాంతి అన్నారు. ప్రచారంలో భాగంగా ఆమె డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఆశీస్సులు తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని డిప్యూటీ స్పీకర్​ను కోరారు. తెరాస పార్టీలో బాధ్యతాయుత పదవిలో ఉన్నానని ఆయన వివరించారు. ఇక మోండా మార్కెట్ ప్రాంతంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని ఆమె అన్నారు. ప్రభుత్వం హైదరాబాద్​ నగరానికి చేసిందేమీ లేదన్నారు.

ప్రస్తుత కార్పొరేటర్ సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. చదువుకున్న తనకు అవకాశం కల్పిస్తే మోండామార్కెట్ డివిజన్​ను అభివృద్ధి పథంలో తీసుకువెళ్లి ఆదర్శ డివిజన్​గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

డిప్యూటీ స్పీకర్ సాబ్ మీ ఓటు కాంగ్రెస్​కు వేయండి: బాల ప్రశాంతి

ఇదీ చూడండి:మీరు గెలిపించండి... కొట్లాడైనా సమస్యలు పరిష్కరిస్తా: రేవంత్

ABOUT THE AUTHOR

...view details