హైదరాబాద్ అభివృద్ధి కోసం డిసెంబర్ 1వ తేదీన జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి రాసూరి సునీతకి ఓటేయాలని ఉప సభాపతి పద్మారావు గౌడ్.. ఓటర్లను కోరారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెట్టుగూడ డివిజన్లోని దాతర్ కాంపౌండ్, దూద్ బావి, ఓల్డ్ అమర్ టాకీస్, చింతబావి ప్రాంతాల్లో అభ్యర్థి, నాయకులు, కార్యకర్తలతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి పరిపాలనా వ్యవస్థను ప్రజలకు చేరువలో నిలిపిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కిందని ఉప సభాపతి అన్నారు.
అభివృద్ధిని చూసి ఓటేయండి: పద్మారావు గౌడ్
సంక్షేమ పథకాలతో అన్ని రంగాల్లో రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని ఉప సభాపతి పద్మారావు గౌడ్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా మెట్టుగూడ డివిజన్ పరిధిలో అభ్యర్థి, నాయకులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ ఆరేళ్లలో నగరంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయాలని ఓటర్లను కోరారు.
అభివృద్ధిని చూసి ఓటేయండి: పద్మారావు గౌడ్
ఈ ఆరేళ్లలో నగరంలో జరిగిన అభివృద్ధిని చూసి ఓటేయాలని ఓటర్లను కోరారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని అభ్యర్థి రాసూరి సునీత కోరారు.
ఇదీ చదవండి:కేంద్రానికి వ్యతిరేకంగా త్వరలోనే జాతీయ సదస్సు: కేసీఆర్