పెద్ద సంఖ్యలో పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలని తెలంగాణ శాసనసభ ఉపసభాపతి పద్మారావు గౌడ్ సూచించారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించాలన్నారు. సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండి డివిజన్‌లో నియోజకవర్గ స్థాయి ఓటర్ల నమోదు అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
పట్టభద్రులను ఓటు నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలి: పద్మారావు గౌడ్ - శాసనసభ ఉపసభాపతి పద్మారావు గౌడ్
ఎమ్మెల్సీ ఎన్నికల దృష్ట్యా పట్టభద్రులు ఓటు నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని తెలంగాణ శాసనసభ ఉపసభాపతి పద్మారావు గౌడ్ సూచించారు. సికింద్రాబాద్‌లోని సీతాఫల్‌మండిలో నియోజకవర్గ స్థాయి ఓటర్ల నమోదు అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
పట్టభద్రులను ఓటు నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలి: పద్మారావు గౌడ్
బస్తీల్లో స్థానిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. కొత్త రెవెన్యూ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించారు. రాబోయే రోజుల్లో ప్రతి కట్టడం వివరాలను ధరణి వెబ్‌సైట్‌లో నమోదు చేస్తామని...వాటిని ఉచితంగానే క్రమబద్ధీకరించుకునే అవకాశం కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సామల హేమ, తెరాస యువ నేత రామేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.