తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉప్పల్​ కుమ్మరిగుంటలో నాలా పనులకు శంకుస్థాపన - జీహెచ్​ఎంసీ ఉపమేయర్​ మోతె శ్రీలత, ఎమ్మెల్యే బేతి సుభాష్​ రెడ్డి వార్తలు

హైదరాబాద్​ ఉప్పల్​ పరిధిలో నాలా పనులకు ఎమ్మెల్యే బేతి సుభాష్​రెడ్డితో కలిసి ఉపమేయర్​ మోతె శ్రీలత శంకుస్థాపన చేశారు. ఆదర్శనగర్​ శ్మశానవాటికను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.

deputy mayor mothe srilatha, mla bethi subashreddy concreting nala works in uppal kummarikunta
ఉప్పల్ కుమ్మరిగుంటలో నాలా పనులకు శంకుస్థాపన

By

Published : May 19, 2021, 7:07 PM IST

హైదరాబాద్‌ ఉప్పల్‌ పరిధిలోని చిలుకానగర్‌ డివిజన్‌లో ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డితో కలిసి జీహెచ్​ఎంసీ ఉపమేయర్‌ మోతె శ్రీలత పర్యటించారు. కుమ్మరిగుంటలో రూ.12 లక్షల వ్యయంతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం విశాతట్ ఎంక్లేవ్, రాఘవేంద్ర నగర్ కాలనీ, కావేరి నగర్ కల్వర్టుల నిర్మాణ పనులను పరిశీలించారు.

ఆదర్శనగర్ ఎస్సీ కమ్యూనిటీ హాల్ పక్కన ఉన్న శ్మశాన వాటిక సదుపాయాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మోడల్ శ్మశానవాటికగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. చిలక నగర్ మెయిన్ రోడ్డు పైన ఉన్న సీవరేజ్ లైన్లు చిలుకానగర్ లైన్లో కలపడం వల్ల నిత్యం పొంగుతోందని కార్పొరేటర్‌ పన్నాల గీత ఆమె దృష్టికి తీసుకొచ్చారు.

ఇదీ చదవండి:కొవిడ్ బాధితులకు సీఎం భరోసా.. నేనున్నానంటూ అభయహస్తం

ABOUT THE AUTHOR

...view details