హైదరాబాద్ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రగతి నగర్, ప్రశాంతి గోల్డెన్ హిల్స్‌లో స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 250 మంది కూలీలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మొత్తం నెల రోజులకు సరిపోయే 15 రకాల వస్తువులతో కూడిన కిట్‌ను అందజేశారు.
నిత్యావసర సరుకులు అందజేసిన డిప్యూటీ మేయర్ - DEPUTY MAYOR DHANRAJ YADAV
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతినగర్‌లో లాక్డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న 250 మంది నిరుపేదలకు స్మైల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్ ధన్ రాజ్ యాదవ్ నిత్యావసర సరుకులు అందజేశారు.
![నిత్యావసర సరుకులు అందజేసిన డిప్యూటీ మేయర్ daily commodities distribution](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7056150-410-7056150-1588591459925.jpg)
నిత్యావసర సరుకులు అందజేసిన డిప్యూటీ మేయర్
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ మేయర్ ధన్‌రాజ్ యాదవ్ పేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు. ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద పిలుపు మేరకే నిజాంపేట పరిధిలో నిత్యం భోజనంతో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.
ఇవీ చూడండి:హైదరాబాద్‌లో ఒక్క రోజులోనే 20 కేసులు
TAGGED:
DEPUTY MAYOR DHANRAJ YADAV