ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి చర్చనీయాంశ వ్యాఖ్యలు చేశారు. వైకాపా తలుపులు తెరిస్తే తెదేపా ఎమ్మెల్యేలందరూ చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీలో చివరకు మిగిలేది చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ మాత్రమేనని వ్యాఖ్యానించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా నారాయణస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమయంలో... చంద్రబాబు వియ్యంకుడు బాలకృష్ణ సంగతేంటని విలేకరులు ప్రశ్నించగా... ఆయన కూడా వస్తారని చెప్పారు. బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పుల కేసునుంచీ అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి సాయంతోనే బయటపడ్డారని గుర్తుచేశారు. తెదేపా ఎమ్మెల్యేలను బెదిరింపులతో చేర్చుకుంటారా..? అని విలేకర్లు ప్రశ్నించగా... దానికి సమాధానం ఇవ్వలేదు.
'తెదేపాలో చివరకు మిగిలేది వాళ్లిద్దరే' - narayanaswamy comments on lokesh
తెలుగుదేశం పార్టీలో చివరకు మిగిలేది చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ మాత్రమేనని... ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి వ్యాఖ్యానించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా నారాయణస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు.

'తెదేపాలో చివరకు మిగిలేది వాళ్లిద్దరే'