ఏపీ మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో వైకాపా మద్దతుదారుల ప్రభంజనం కొనసాగిందని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా వైకాపా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. జగన్ పరిపాలన చూసి అందరూ ఆదరించారన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రభుత్వం తరఫున పూర్తి మద్దతు ఉంటుదని స్పష్టం చేశారు.
షర్మిల పార్టీ.. ఆమె వ్యక్తిగతం: ఏపీ ఉపముఖ్యమంత్రి - పంచాయతీ ఫలితాలపై ధర్మాన కృష్ణదాస్ కామెంట్స్
ఏపీ మెుదటి విడత పంచాయతీ ఎన్నికల్లో వైకాపా ప్రభంజనం కొనసాగిందని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రభుత్వం తరఫున పూర్తి మద్దతు ఉంటుదని స్పష్టం చేశారు. షర్మిల పార్టీ విషయం ఆమె వ్యక్తిగతమన్నారు.
షర్మిల పార్టీ.. ఆమె వ్యక్తిగతం: ఏపీ ఉపముఖ్యమంత్రి
తెలంగాణలో పార్టీ ఆలోచన షర్మిల వ్యక్తిగతమని ధర్మాన పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడడంతో వైఎస్ఆర్ అభిమానులకు అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. షర్మిల రాజకీయ ప్రవేశాన్ని తాము తప్పుపట్టడం లేదన్నారు.
TAGGED:
ఏపీ పంచాయతీ ఎన్నికలు న్యూస్