తెలంగాణ

telangana

ETV Bharat / state

అన్నదాతలకు శుభవార్త.. వారం ముందే రైతుబంధు నిధుల జమ!

Start of Rythu Bandhu Scheme: రైతుబంధు నిధుల జమ ప్రకటించిన తేదీ కంటే ముందే ప్రారంభమైంది. యాసంగి సీజన్​కు సంబంధించిన పంట పెట్టుబడి సాయం చెల్లింపులను ఈ నెల 28 నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల నిర్ణయించారు. ఒక ఎకరా నుంచి ప్రారంభించి సంక్రాంతి నాటికి రైతులందరి ఖాతాల్లో నగదు జమ చేయాలని చెప్పారు.

Start of Rythu Bandhu Scheme
Start of Rythu Bandhu Scheme

By

Published : Dec 23, 2022, 10:47 AM IST

ప్రకటించిన తేదీ కంటే ముందే ప్రారంభమైన రైతుబంధు నిధులు

Rythu Bandhu Scheme Start: రైతుబంధు నిధుల జమ.. ప్రకటించిన తేదీ కన్నా ముందే ప్రారంభమైంది. యాసంగి సీజన్‌కు సంబంధించిన పంట పెట్టుబడి సాయం చెల్లింపులను ఈ నెల 28న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల నిర్ణయించారు. ఒక ఎకరా నుంచి ప్రారంభించి సంక్రాంతి నాటికి రైతులందరి ఖాతాల్లో నగదు జమ చేయాలని చెప్పారు. అయితే రైతుల ఖాతాల్లో నగదు జమ ముందే ప్రారంభమైంది.

ప్రకటించిన 28వ తేదీ కన్నా వారం రోజుల ముందే కొంత మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కొంత మంది రైతులతో పాటు జిల్లా పొరుగున ఉన్న కొన్ని మండలాల రైతులకు రైతుబంధు సాయం అందినట్లు సమాచారం. సెస్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని నిర్ణీత తేదీ కన్నా ముందే రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details